Share News

తాగునీటి తంటాలు

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:48 PM

దోమ మండలంలోని అయినాపూర్‌ 12వ వార్డులో తాగునీటి కోసం గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాగునీటి తంటాలు
అయినాపూర్‌లో ట్యాంకర్‌ దగ్గర నీటిని పట్టుకుంటున్న గ్రామస్థులు

దోమ, ఏప్రిల్‌ 2: దోమ మండలంలోని అయినాపూర్‌ 12వ వార్డులో తాగునీటి కోసం గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్‌ భగీరథ తాగునీరు అంతంత మాత్రమే సరఫరా అవుతుండటంతో కాలనీవాసులకు ట్యాంకర్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో తాగునీటి సరఫరా బోర్లలో నీటి మట్టాలు తగ్గిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు.

Updated Date - Apr 02 , 2024 | 11:48 PM