Share News

డబుల్‌డ్యూటీ డ్రైవర్లకు రోజుకు రూ.వెయ్యి

ABN , Publish Date - May 02 , 2024 | 05:08 AM

ఆర్టీసీలో డ్రైవర్ల కొరత కారణంగా డబుల్‌ డ్యూటీ చేసే వారికి రోజుకు అదనంగా రూ.వెయ్యి చెల్లించాలని నిర్ణయించినట్లు

డబుల్‌డ్యూటీ డ్రైవర్లకు రోజుకు రూ.వెయ్యి

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో డ్రైవర్ల కొరత కారణంగా డబుల్‌ డ్యూటీ చేసే వారికి రోజుకు అదనంగా రూ.వెయ్యి చెల్లించాలని నిర్ణయించినట్లు సంస్థ ఎండీ సజ్జనార్‌ బుధవారం తెలిపారు. వేసవి ఎండల దృష్ట్యా మే, జూన్‌ నెలల్లో డబుల్‌ డ్యూటీ నిర్వహించేందుకు ముందుకు వచ్చే డ్రైవర్లకు ప్రోత్సాహకాలను పెంచినట్టు తెలిపారు. లక్షే లక్ష్యం కార్యక్రమంలో భాగంగా పలు డిపోల్లో డ్రైవర్లకు డబుల్‌ డ్యూటీ అనివార్యంగా మారడంతో ప్రోత్సాహకాన్ని వెయ్యికి పెంచినట్లు చెప్పారు.

Updated Date - May 02 , 2024 | 05:08 AM