Share News

డబుల్‌ బెడ్‌రూంలను త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:01 PM

అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూంల పనులను త్వరితగతిన పూర్తిచేసి అర్హులకు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ గౌతం అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌, అర్‌ అండ్‌ బీ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

డబుల్‌ బెడ్‌రూంలను త్వరగా పూర్తి చేయాలి
సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌

ఇళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలి

సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ గౌతమ్‌

మేడ్చల్‌ జనవరి 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూంల పనులను త్వరితగతిన పూర్తిచేసి అర్హులకు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ గౌతం అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌, అర్‌ అండ్‌ బీ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని డబుల్‌ బెడ్‌రూంల ఇళ్ల ను అర్హులకు అందజేశారు. అసంపూర్తిగా ఉన్న వాటి పనులు ఏలా జరుగుతున్నాయి, ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నాయనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్‌బెడ్‌ రూంలను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధ్దిదారులకు అందజేయాలన్నారు. జిల్లాలో డబుల్‌బెడ్‌ రూంల పంపిణీలో ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకొని, అందుకు అసరమైన సలహాలు, సూచనలు తెలియజేశారు. జిల్లాలోని అయా మున్సిపాలిటీలు, మండలాల వారీగా మంజురైన లబ్ధిదారులకు అందజేయాల్సిన డబుల్‌బెడ్‌ రూంల గురించి జీహెచ్‌ఎంసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్‌ అండ్‌ బీ ఈఈ శ్రీనివాసమూర్తి, అర్డీవోలు, జీహెచ్‌ఎంసీ అధికారులు, అయా మండలాల తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:01 PM