సెల్ ఫోన్ పోతే ఆందోళన చెందవద్దు
ABN , Publish Date - Oct 08 , 2024 | 12:43 AM
సెల్ ఫోన్ పోయిన, చోరికి గురైన ఆందోళన చెందవద్దని సీఐఈఆర్ అప్లికేషన్ ద్వారా తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన రూ. 20 ల క్షల విలువ గల 104 మొబైల్ ఫోన్లను సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యా లయంలో బాధితులకు ఎస్పీ అందజేసి మాట్లాడారు.
ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల క్రైం, అక్టోబరు 7 : సెల్ ఫోన్ పోయిన, చోరికి గురైన ఆందోళన చెందవద్దని సీఐఈఆర్ అప్లికేషన్ ద్వారా తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన రూ. 20 ల క్షల విలువ గల 104 మొబైల్ ఫోన్లను సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యా లయంలో బాధితులకు ఎస్పీ అందజేసి మాట్లాడారు. సీఐఈఆర్ వెబ్‌సైట్‌లో విని యోగ దారులు తమ ఫోన్ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. పోయిన సెల్ ఫోన్ల రికవరి కోసం ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్‌ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టుబుళ్లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామని వివ రించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 601 ఫోన్లను రికవరి చేసి బాధితులకు అందించామన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సీఐఈఆర్ అప్లికేష న్ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. దొంగి లించిన ఫోన్లతో నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సెకండ్ హ్యాండ్ పోన్లు కొనే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. ఎవరికైనా సెల్ ఫోన్ దొరికి తే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా సాంకే తికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లను రికవరి చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటీ కోర్ ఇన్స్‌పెక్టర్ రఫీక్ ఖాన్, ఆర్‌ఎస్సై కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుల్లు అజర్, యాకుబ్, మల్లేశంలను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాల ను అందజేశారు. అనంతరం బాధితులు తమ ఫోన్ ఫోయినపుడు అవలంబించా ల్సిన విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖ అధికారులు ఉన్నారు.
ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు
ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఆర్జిదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు లపై తక్షణమే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువ చేసే దిశగా పోలీస్ అధికారులు పనిచేయాలన్నారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వివరించారు.