Share News

‘గృహజ్యోతి’పై ఆందోళన చెందొద్దు

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:20 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తోన్న ‘గృహజ్యోతి’పై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు.

‘గృహజ్యోతి’పై ఆందోళన చెందొద్దు
ఎస్‌ఈ వెంకటరమేష్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

- విద్యుత్‌ భవన్‌లో ఎస్‌ఈతో సమావేశం

పాలమూరు, జూన్‌10 : తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తోన్న ‘గృహజ్యోతి’పై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. సో మవారం విద్యుత్‌ భవన్‌లో ఎస్‌ఈ పి.వెంకట రమేష్‌తో మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌ గౌడ్‌ తో కలిసి ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అర్హు లైన వారందరికీ ‘గృహజ్యోతి’అమలుపై ఎస్‌ఈతో సు దీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఎన్నికల కోడ్‌ కారణంగా ‘గృహజ్యోతి’ పథకం ఆలస్యమైందన్నారు. మహబూబ్‌నగర్‌ జి ల్లాలో 98,007కనెక్షన్లు అర్హత సాధించినట్లు తెలి పారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొందరికి జీరో బిల్లు రాలేదని, అలాంటి వారు ఆం దోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా ఎవ రికైనా జీరో బిల్లు రాకపోతే మునిసిపల్‌ కార్యాల యంలో ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుతో పాటు వినియో గదారుల నెంబర్‌తో అనుసంధానం చేయాలని సూ చించారు. అర్హులందరికీ పథకం వర్తిస్తుందన్నారు. సమావేశంలో డీఈటీ చంద్రమౌళి, ఏఈ జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ ప్రజాదర్బార్‌ ప్రారంభం

మహబూబ్‌నగర్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నిర్వహించిన ప్రజాదర్బార్‌ను ఎన్నికలకోడ్‌ కారణంగా నిలిపివేశారు. మళ్లీ సోమవారం మహ బూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్ర జాదర్బార్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలనుంచి అర్జీ లు స్వీకరించారు. అప్పటికప్పుడే పరిష్కరించాల్సిన సమస్యలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం ఆదేశాలిచ్చారు. మరి కొన్ని అర్జీలపై వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇ చ్చారు. అయితే ఎక్కువగా డబుల్‌బెడ్‌రూమ్‌ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, పెన్షన్లుపై వినతులు వచ్చాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హుందరికీ పథకాలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కు మార్‌ గౌడ్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకురండి

మహబూబ్‌నగర్‌: జిల్లా పరిషత్‌ పరిధిలో ఉన్న ముఖ్యమైన రహదారులను ఆర్‌అండ్‌బీ పరిధిలోని తీసుకురావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఇందు కోసం అవసరమైన కార్యా చరణ రూపొందించాలని పేర్కొన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారం భమైందని, ఎక్కడైనా రహదారులు దెబ్బతింటి వెం టనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని తెలిపారు. స్థానికంగా ఉన్న పాతభవనాలకు అవస రమైన చోట మరమ్మతులు చేపట్టాలని వెల్లడిం చా రు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ అధికారులు శ్రవణ్‌ ప్రకాశ్‌, సంధ్య పాల్గొన్నారు.

పనులు వేగవంతం చేయాలి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు త్వరితగ తిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం మునిసిపల్‌ కమి షనర్‌, మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో షా బజార్‌ ఉన్నత పాఠశాల, రాజేంద్రనగర్‌ ప్రాథమిక పాఠశాల, కొనపాలమూర్‌ పాఠశాల, ప్రైమరీ పాఠ శాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆ యన వెంట మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, కౌన్సి లర్‌ ముస్తాక్‌, మునిసిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి, ఎంఈ బెంజ్‌మన్‌, బస్వరాజ్‌, ఏఈ హరికృష్ణ, ఏఈఈ వైష్ణవి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:20 PM