దళారులను నమ్మి మోసపోవద్దు
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:25 AM
రైతులు క ష్టపడి పండించిన పంటను ద ళారుల చేతుల్లో పెట్టి మోసపోవద్దని చండూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యం, గట్టుప్పల్ తహసీల్దార్ రాములు అన్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు
చండూరు, గట్టుప్పల్, అక్టోబ రు (ఆంధ్రజ్యోతి) 24: రైతులు క ష్టపడి పండించిన పంటను ద ళారుల చేతుల్లో పెట్టి మోసపోవద్దని చండూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యం, గట్టుప్పల్ తహసీల్దార్ రాములు అన్నారు. చండూరు పట్టణంతో, గట్టుప్పల్ మండలంలోని తేరట్‌పల్లి గ్రామంలో ఏర్పా టు చేసిన పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు స ద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నేరుగా ధాన్యా న్ని తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. రైతులను మోసగిస్తే దళారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన కోడి సుష్మ, తహసీల్దార్ దశరథ, ఎంపీడీవో రాంరెడ్డి, ఏవో రేవతి, మునిసిపల్ కౌన్సిలర్ కోడి వెంకన్న, డైరెక్టర్లు కట్ట బిక్షం, మిట్టపల్లి రా జు, గిరి సత్తయ్య, రాములు, ఆంజనేయులు, గట్టుప్పల్‌లో పీఏసీఎస్ చైర్మన కోడి సుష్మ, మాజీ ఎంపీటీసీ గొరిగి సత్తయ్య, డైరెక్టర్లు అచ్చం శ్రీనివాస్, ఆంజనేయులు, సెక్రటరీ షఫీ, రైతులు పాల్గొన్నారు.