Share News

బాధ్యతలు అప్పుడే చేపట్టొద్దు..!

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:11 AM

ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండే రెవెన్యూ, పోలీసు విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

బాధ్యతలు అప్పుడే చేపట్టొద్దు..!

4 రోజుల కిందే 23 మంది ఐపీఎస్‌ల బదిలీ

కొందరికి బాధ్యతలు స్వీకరించొద్దని ఆదేశాలు

వారి పని తీరుపై అభ్యంతరాలు రావడంతోనే..

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండే రెవెన్యూ, పోలీసు విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే క్లీన్‌ చిట్‌ ఉన్నవారికి వారి సామర్థ్యం మేరకు బదిలీలు, పోస్టింగులు కల్పించారు. నాలుగు రోజుల కిందే 23 మంది ఐపీఎ్‌సలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వెయిటింగ్‌లో ఉన్న వారికీ పోస్టింగులు లభించాయి. అయితే తాజా బదిలీల్లో కొంతమందికి బాధ్యతలు చేపట్టవద్దని మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా మెరిట్‌, ట్రాక్‌ రికార్డు ఆధారంగానే పోస్టింగ్‌లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన బదిలీల్లో కొందరి ట్రాక్‌ రికార్డుపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. వారిని బాధ్యతలు చేపట్టవద్దని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. తాజా బదిలీల్లో ఇప్పటివరకు బాధ్యతలు చేపట్టని వారు ఎవరనేది ఎవరికి వారుగా లెక్కలేసుకుంటున్నారు. కాగా, త్వరలో మరికొంత మంది ఐపీఎ్‌సల బదిలీలకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు బాధ్యతలు చేపట్టొద్దని చెప్పిన వారిని పక్కనబెట్టి వారి స్థానంలో కొత్త వారిని నియమించే అవకాశముంది. ఐపీఎ్‌స పోస్టింగుల విషయంలో ఏ అభ్యంతరాలకు తావులేకుండా..కచ్చితంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 08 , 2024 | 05:11 AM