Share News

నిర్లక్ష్యం వహించొద్దు

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:34 PM

ఒక చిన్న నిప్పురవ్వ ను నిర్లక్ష్యం చేసినా అది పెను ప్ర మాదానికి కారణం కావచ్చని అ గ్నిమాపక కేంద్రం అధికారి చం ద్రశేఖర్‌ అన్నారు.

 నిర్లక్ష్యం వహించొద్దు
అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో మంటలను ఆర్పుతున్న డాక్టర్‌ శివప్రసాద్‌

- అగ్నిమాపక కేంద్రం అధికారి చంద్రశేఖర్‌

- జనరల్‌ ఆస్పత్రి ప్రాంగణంలో అవగాహన

వనపర్తి వైద్యవిభాగం, ఏప్రిల్‌17: : ఒక చిన్న నిప్పురవ్వ ను నిర్లక్ష్యం చేసినా అది పెను ప్ర మాదానికి కారణం కావచ్చని అ గ్నిమాపక కేంద్రం అధికారి చం ద్రశేఖర్‌ అన్నారు. బుధవారం జి ల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రి ప్రాంగణంలో ఆర్‌ఎంవో డాక్టర్‌ శి వప్రసాద్‌ ఆధ్వర్యంలో అగ్నిమాప క అధికారులు అగ్నిమాపక వా రోత్సవాలను నిర్వహించారు. అగ్ని ప్రమాధాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి, మంటలు ఎలా ఆర్పాలి అనే వివరాలను ప్రయోగం ద్వారా వివరించారు. కార్యక్రమంలో జ నరల్‌ ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ శివప్రసాద్‌, వైద్యులు, హెడ్‌నర్సు రజిని, వైద్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది నర్సింహరెడ్డి, బాల్‌రాజు, కిరణ్‌, బాలకొండ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ..

ఆత్మకూరు: అగ్నిమాపక వారోత్సవాలలో భా గంగా ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆ సుపత్రిలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రి సిబ్బందికి బుధవారం అవ గాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ప్రమాదం జరిగిన స్థలంలో అగ్నికి తొందరగా ఆహుతి అయ్యే వస్తు వులను అక్కడి నుంచి తొలగించాలని సూచించారు. అనంతరం ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచిం చారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఫైర్‌ స్టేషన్‌ వలయాధికారి శ్రీనివాస రావు, సిబ్బంది సంజీవరెడ్డి, గోపాల్‌రెడ్డి, భాను చందర్‌ , వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 11:34 PM