Share News

తాగునీటి ఎద్దడి రానివ్వొద్దు

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:33 PM

పేట నియోజకవర్గంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందు లు రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేప ట్టాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు.

తాగునీటి ఎద్దడి రానివ్వొద్దు

- ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి

- మిషన్‌ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 26: పేట నియోజకవర్గంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందు లు రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేప ట్టాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు. సో మవారం స్థానిక సీవీఆర్‌ బంగ్లాలో మిషన్‌ భగీ రథ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి ప్రారం భం దృష్ట్యా నియోజకవర్గంలోని ఏఒక్క గ్రామం లో తాగునీటి సమస్య లేకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూ చించారు. మరికల్‌, దామరగిద్ద, ధన్వాడ, కోయిల్‌ కొండ, నారాయణపేట మండలాల్లోని ఆయా గ్రా మాలలో నీటి సమస్య ఉన్నట్లు తన దృష్టికి వ చ్చిందని మిషన్‌ భగీరథ అధికారులు ఆయా గ్రా మాలకు వెళ్లి తాగునీటి సమస్యను తీర్చాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సమస్యను తీర్చడంతో పాటు పైపు లైను లీకేజి ఉంటే సరి చేయాల న్నారు. మిషన్‌ భగీరథ ఈఈ వెంకట్‌రెడ్డి మా ట్లాడుతూ సంగంబండ రిజర్వాయర్‌ నుంచి మ క్తల్‌, ఊట్కూర్‌, నారాయణపేట, దామరగిద్ద మండలాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ఉన్నతాధికారులు కొత్త ప్రతిపాదన చేశారని తెలి పారు. అలాగే తాగునీటి పరీక్షల కోసం పేటలో జిల్లా ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తే ఆ ల్యాబ్‌లో ముగ్గురికి ఉపాధి లభిస్తుందని ఈఈ ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ అంశంపై ఎమ్మె ల్యే సానుకూలంగా స్పందించారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ. 13లక్షల నిధులు అవసరమవుతాయని ఎమ్మెల్యే, అధికారులు అంచనా వేశారు. ఆ నిధులను ఎస్‌డీఎఫ్‌ కింద ప్రాధాన్యత ప్రకారం మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమావేశంలో మిషన్‌ భగీరథ ఈఈ, డీఈఈలు ప్రసాద్‌, అచ్చన్న, నాగబాబు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 11:33 PM