Share News

వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఉండొద్దు

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:18 PM

వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అ ధికారులను ఆదేశించారు.

 వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఉండొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

- కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, మార్చి 27: వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అ ధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ లో ని కాన్ఫరెన్స్‌ హాల్లో తాగునీటి సమస్య, ఉపాధి హా మీ పనులపై అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ తో కలిసి పంచాయతీ రాజ్‌, మిషన్‌ భగీరథ, ము నిసిపల్‌ కమిషనర్లతో వెబెక్స్‌ ద్వారా సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ జిల్లాలో తాగునీటికి ఎలాంటి కొరత లేదని మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేయడంలో సరైన పర్యవేక్షణ, సమన్వయం అవసరం ఉందన్నారు. కొ న్నిసార్లు సరఫరాలో ఇబ్బందులు తలెత్తవచ్చని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నీటి సరఫరా చేసే వి ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థాని కంగా ఉన్న బోర్లు, మోటార్లు రిపేర్లు చేయించాల న్నారు. లీకేజీలు లేకుండా చూసుకోవాలని అవస రమైతే ప్రైవేటు బోర్లు లీజుకు తీసుకుని నీటి స రఫరా చేయాలని సూచించారు. పంచాయతీ రాజ్‌, మిషన్‌ భగీరథ సిబ్బంది ఉదయాన్నే క్షేత్రస్థాయి లో పర్యటించి తాగునీటి సమస్యలు తెలుసుకుని, పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశించారు. వారంలో మూడు రోజులు తప్పనిసరి గా పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. గ్రామాల వారీగా వేసవి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చే సుకోవాలని సూచించారు. నీటి వృధాను అరికట్టేం దుకు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపా రు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ మునిసి పాలి టీలు, గ్రామ పంచాయతీల్లో నీటి వనరులు, సరఫ రా వ్యవస్థలపై అధికారులను వివరాలు అడిగి తె లుసుకున్నారు. సమస్యలను వేగంగా పరిష్కరిం చాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల కోసం సంప్రదించేందుకు పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి, ఎంపీడీవో, ఎంపీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఫోన్‌ నంబర్లు, ప్రతీ గ్రామ పంచాయతీ భవనం ముందు బోర్డు లు రాయించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

లేబర్‌ మొబిలైజేషన్‌ పెంచాలి

ఉపాధి హామీ పనుల్లో లేబర్‌ మొబిలైజేషన్‌ త క్కువ ఉందని కారణాలపై నివేదిక సమర్పించాల ని సిబ్బందిని కలెక్టర్‌ ఆదేశించారు. పని ప్రదేశాల్లో తాగునీరు, షేడ్‌ నెట్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీవారం సకాలంలో మస్టర్‌ పూర్తి చేసి సమ యానికి కూలీ డబ్బులు అందేవిధంగా చూడాలని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నర్సరీలలో , హరితహారంలో నాటి న మొక్కలకు సక్రమంగా నీటిని అందించి రక్షించాలని ఆదేశించారు. గ్రామాల్లో సీజనల్‌ వ్యా ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, ఫాగింగ్‌, బ్లీచింగ్‌ చేస్తు దోమలు, అంటువ్యాధులు ప్రబల కుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో ఉమా దేవి, డీపీవో రమణ మూర్తి, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ జగన్‌మోహన్‌, వెబెక్స్‌ ద్వారా ఎంపీడీవోలు, ఏపీవోలు, డీఈలు, ఏఈలు పంచాయతీ సెక్రటరీ లు తదితరులు పాల్గొన్నారు.

సెక్టార్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా : సెక్టార్‌ ఆఫీసర్లు, పోలీస్‌ సెక్టార్‌ ఆఫీసర్లు తమ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి సమన్వ యంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశించారు. బుధవా రం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్లో ఏర్పాటు చేసిన సెక్టార్‌ అధికారులు, పోలీస్‌ సెక్టార్‌ అధి కారుల సమావేశంలో కలెక్టర్‌ పాల్గొని దిశాని ర్దేశం చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సెక్టార్‌ అధికారులు ప్రతినిధులని వారు ఎంత సమర్థవంతంగా పని చేస్తే ఎన్నికలు అంత స జావుగా ప్రశాంతంగా పూర్తి అవుతాయన్నారు. అందుకే సెక్టార్‌ అధికారులు సమన్వయంతో పని చేస్తూ స్థానిక వ్యక్తులతో పరిచయం ఏర్పా టు చేసుకోవడం, రూట్‌ సరిగ్గా అర్థం చేసుకో వడం స్థానిక సమస్యలను ఆకళింపు చేసుకొని విధుల్లో కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందన్నా రు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల రోజున కనీస మౌలిక సదుపాయాలు ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. వేసవికాలాన్ని దృష్టి లో పెట్టుకొని ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద చలు వ నీడ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవా లని సూచించారు. అదనపు కలెక్టర్‌ నగేష్‌, ఎ న్నికల విభాగం పర్యవేక్షకుడు రమేష్‌ రెడ్డి, సె క్టార్‌ ఆఫీసర్లకు వారి బాధ్యతలపై అవగాహన కల్పించారు. త్వరలోనే పూర్తిస్థాయి శిక్షణ ఇస్తా మన్నారు. కార్యక్రమంలో సెక్టార్‌ అధికారులు పోలీస్‌ సెక్టార్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:18 PM