Share News

ప్రమాద సమయంలో అధైర్యపడొద్దు

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:37 PM

సిలిండర్‌ నుంచి మంటలు వ్యాపించినప్పుడు, ఎలక్ర్టిక్‌ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఉండి, నివారణకు చర్యలు చేపట్టాలని అగ్నిమాపక శాఖ ఇన్‌చార్జి అధికారి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

ప్రమాద సమయంలో అధైర్యపడొద్దు
సిలిండర్‌ నుంచి వ్యాపించిన మంటలను ఎలా ఆర్పాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది

- అగ్నిమాపక శాఖ ఇన్‌చార్జి అధికారి శ్రీకాంత్‌రెడ్డి

జడ్చర్ల (మిడ్జిల్‌), ఏప్రిల్‌ 16 : సిలిండర్‌ నుంచి మంటలు వ్యాపించినప్పుడు, ఎలక్ర్టిక్‌ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఉండి, నివారణకు చర్యలు చేపట్టాలని అగ్నిమాపక శాఖ ఇన్‌చార్జి అధికారి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జడ్చర్ల పట్టణంలోని పద్మావతి కాలనీలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా కాలనీ వాసులకు, అపార్ట్మెంట్‌లలో నివాసించే వారికి సిలిండర్‌, ఎలక్ర్టిక్‌ వైర్లకు మంటలు వ్యాపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్త్రతల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ కోట్ల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితిరెడ్డి, రిటైర్డ్‌ ఫైర్‌ అధికారి చెన్నయ్య, సిబ్బంది వెంకటయ్య, నవీన్‌కుమార్‌, శ్రీనివాస్‌, గౌస్‌పాషా ఉన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:37 PM