Share News

Manchiryāla- యువత వ్యసనాలబారిన పడొద్దు

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:23 PM

యువత వ్యసనాల బారిన పడొద్దని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. బుధవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్‌ సమావేశ మందిరంలో డీసీపీ అశోక్‌కుమార్‌, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవో రాములు, హరికృష్ణ, అబ్కారీ, మద్యపాన నిషేధ శాఖ పర్యవేక్షకులు నంద గోపాల్‌, డీఐఈవో శైలజ, డీఈవో యాదయ్యలతో కలిసి సమావేశం నిర్వహించారు.

Manchiryāla-        యువత వ్యసనాలబారిన పడొద్దు
మాట్లాడుతున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 24 : యువత వ్యసనాల బారిన పడొద్దని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. బుధవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్‌ సమావేశ మందిరంలో డీసీపీ అశోక్‌కుమార్‌, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవో రాములు, హరికృష్ణ, అబ్కారీ, మద్యపాన నిషేధ శాఖ పర్యవేక్షకులు నంద గోపాల్‌, డీఐఈవో శైలజ, డీఈవో యాదయ్యలతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్ధాలు రవాణా కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి సాగు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ కళాశాలల్లో మత్తు పదార్ధల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

అవగాహన కార్యక్రమాలు..

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతందని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో మీడియా ప్రతినిదులలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి సెగ్మెంట్లలో ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మే 13 పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుందని తెలిపారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, పౌర సరఫరా అధికారి శారద తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:23 PM