Share News

కాంగ్రెస్‌లోకి దానం!

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:28 AM

లోక్‌సభ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.

కాంగ్రెస్‌లోకి దానం!

వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ కూడా..

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఇరువురి భేటీ

18న పార్టీలో చేరే అవకాశం

దానంకు సికింద్రాబాద్‌ లేదా మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ ?

హైదరాబాద్‌, ఖైరతాబాద్‌/అఫ్జల్‌గంజ్‌/వరంగల్‌ మార్చి 15(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నేత, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. ఈ మేరకు ఇరువురు నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని శుక్రవారం వేర్వేరుగా కలిశారు. సీఎం నివాసానికి వెళ్లిన వెళ్లిన దానం నాగేందర్‌... అక్కడ రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులతో సమావేశయ్యారు. ఇక, వరంగల్‌ ఎంపీ దయాకర్‌ సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సమక్షంలో ఈ భేటీ జరిగింది. దానం నాగేందర్‌, పసునూరి ద యాకర్‌ కాంగ్రె్‌సలో చేరడం ఖాయమైందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 18న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో వారు పార్టీలో చేరే అవకాశం ఉందని వెల్లడించాయి. అంతేకాక, దానం నాగేందర్‌కు సికింద్రాబాద్‌, మల్కాజిగిరిలో ఏదో ఒక స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, గోషామహల్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి నంద కిశోర్‌ వ్యాస్‌ బిలాల్‌ శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు.

సొంతగూటికి దానం..

కాంగ్రెస్‌లోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దానం నాగేందర్‌.. 2004 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి అసి్‌ఫనగర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి గెలిచి 2014 వరకూ మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన దానం 2018 ఎన్నికల ముందు బీఆర్‌ఎ్‌సలో చేరి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ తన సీటును నిలబెట్టుకున్నారు. బీఆర్‌ఎ్‌సలో తగినంత ప్రాధాన్యం లభించకపోవడం, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, దానం నాగేందర్‌ను తిరిగి పార్టీలోకి తీసుకోవడంపై ఖైరతాబాద్‌ నియోజవర్గం కాంగ్రెస్‌ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నాగేందర్‌ను పార్టీలో తీసుకోవద్దంటూ పలువురు మహిళా నేతలు గాంధీభవన్‌ వద్ద శుక్రవారం నిరసన తెలియజేశారు. మరోపక్క, సిటిం గ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ను కాదనీ కడియం కావ్యకు కేసీఆర్‌ వరంగల్‌ టికెట్‌ కేటాయించారు. ఈ నేపథ్యంలో దయాకర్‌ కాంగ్రె్‌సలో చేరుతుండడం ఆసక్తికరంగా మారింది.

Updated Date - Mar 16 , 2024 | 04:28 AM