Share News

Manchiryāla- దొడ్డు వడ్లకు బోనస్‌ చెల్లించాలి

ABN , Publish Date - May 22 , 2024 | 10:40 PM

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్‌ చెల్లించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం బీజేపీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భం గా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు.

Manchiryāla-     దొడ్డు వడ్లకు బోనస్‌ చెల్లించాలి
చెన్నూరులో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు

హాజీపూర్‌, మే 22: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్‌ చెల్లించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం బీజేపీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భం గా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను ముంచినట్లే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా హామీల పేరుతో రైతులను నట్టేట ముంచుతుందన్నారు. వెంటనే బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం స్వామిరెడ్డి, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు మాధవరపు వెంకటరమణరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎనగందుల కృష్ణమూర్తి, నాయకులు సత్యం, ప్రశాంత్‌, మల్లేష్‌, ధర్మయ్య, శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, రాజనర్సు, తిరుపతి, సతీష్‌, స్వామి,ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి: దొడ్డు వరిధాన్యం క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ వెంటనే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు చెల్లించాలని బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో అంబెద్కర్‌ విగ్రహాం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ సంధ్యరాణికి రైతులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, కిషన్‌ మోర్చా మండల అధ్యక్షుడు వనపర్తి రాకేష్‌, నాయకులు సురేష్‌,సురేందర్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, కిషన్‌, రమణయ్య, సత్తయ్య, అశోక్‌, శ్రీనివాస్‌, మల్లేష్‌, రాయమల్లు, రమేష్‌, రాజన్న పాల్గొన్నారు.

చెన్నూరు: రాష్ట్రంలోని రైతులు పండించిన అన్నిరకాల వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 బోనస్‌ చెల్లించాలని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌ కన్వీనర్‌ వెంకటేశ్వర్‌గౌడ్‌ కోరారు. బుధవారం చెన్నూరు తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

జైపూర్‌: రాష్ట్రంలోని రైతుల దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్‌ చెల్లించాలని, రైతు భరోసా కింద రూ. 15 వేలు చెల్లించాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌ వనజారెడ్డికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దుగుట రాజ్‌కుమార్‌, వేముల తిరుపతిగౌడ్‌, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

భీమారం: రాష్ట్ర ప్రభుత్వం రైతుల దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్‌ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీమారంలోని కొనుగోలు కేంద్రం వద్ద బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాపు, శ్రీనివాస్‌, దుషాంత్‌యాదవ్‌, సతీష్‌, శంకర్‌, రాములు, విజయ, వినోద్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తాండూర్‌: దొడ్డు వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 బోనస్‌ చెల్లించాలని బుధవారం బీజేపీ నాయ కులు తాండూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దూడపాక భరత్‌కుమార్‌, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చిలుముల కృష్ణదేవరాయలు, కార్యవర్గ సభ్యులు కేశెట్టి విజయ్‌కుమార్‌, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి, సీనియర్‌ నాయకులు చిలువేరు శేషగిరి, తుకారం, మహీధర్‌గౌడ్‌, మద్దెర్ల శ్రీనివాస్‌, కుమార్‌, మల్లేష్‌, చరణ్‌, చంద్రయ్య, రమేష్‌, బీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కాసిపేట: అన్నిరకాల వడ్లకు రూ. 500 బోనస్‌ చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్‌ ఇస్తామనడాన్ని నిరసిస్తూ బుధవారం బీజేపీ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపూఆరు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్‌, మండల ప్రధాన కార్యదర్శి ప్రసన్న, బాలరాజు, కిరణ్‌, శంకర్‌, శ్రీనివాస్‌, బాలు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వేమనపల్లి: దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్‌ చెల్లించాలని వేమనపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్‌, మండల ప్రధాన కార్యదర్శి ఏనుముల వెంకటేష్‌, నాయకులు పుల్లయ్య, అంజి, లస్మయ్య, సుధాకర్‌, శ్రీకాంత్‌, మధునయ్య, గోపాల్‌, సంతోష్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 10:40 PM