Share News

దొడ్డి కొమురయ్య పోరాటమే స్ఫూర్తి

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:34 AM

దొడ్డి కొమురయ్య ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొంది ప్రజాపాలన ఏర్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి

దొడ్డి కొమురయ్య పోరాటమే స్ఫూర్తి

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయం: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): దొడ్డి కొమురయ్య ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొంది ప్రజాపాలన ఏర్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా బుధవారం ఆయన త్యాగాన్ని, ఉద్యమ స్ఫూర్తిని రేవంత్‌ గుర్తుచేసుకున్నారు. నిరంకుశపాలన నుంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకునేందుకు, ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన యోధుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం వెల్లడించారు. మంత్రివర్గం నుంచి మొదలుకుని అన్ని నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని రేవంత్‌ చెప్పారు.

Updated Date - Apr 03 , 2024 | 02:34 AM