Share News

‘అధిక దిగుబడుల’పై రిసెర్చ్‌ చేయండి

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:13 AM

రైతాంగం అధిక దిగుబడులు సాధించే దిశగా పరిశోధనలు చేపట్టాలని శాస్త్రవేత్తలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సూచించారు.

‘అధిక దిగుబడుల’పై రిసెర్చ్‌ చేయండి

శాస్త్రవేత్తలకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సూచన

రాజేంద్రనగర్‌, ఫిబ్రవరి16(ఆంధ్రజ్యోతి): రైతాంగం అధిక దిగుబడులు సాధించే దిశగా పరిశోధనలు చేపట్టాలని శాస్త్రవేత్తలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సూచించారు. భారత పరిశ్రమల సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు రాజేంద్రనగర్‌లో నిర్వహించనున్న అగ్రి టెక్‌ సౌత్‌-2024 వ్యవసాయ ప్రదర్శనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రతి సంవత్సరం అగ్రిటెక్‌ సౌత్‌ పేరుతో చేపడుతున్న వ్యవసాయ ప్రదర్శన ద్వారా లక్షలాది మంది రైతులకు ఉపయోగం కలుగుతోందని కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జివి సుబ్బారెడ్డి తెలిపారు.

విశ్వవిద్యాలయం భూములలో హైకోర్టు నిర్మించొద్దు

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూములలో హైకోర్టు భవనం నిర్మించొద్దు అని కోరుతూ వర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్స్‌, విద్యార్థి సంఘాల నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Feb 17 , 2024 | 04:13 AM