Share News

Manchiryāla- పంట భూములు తీసుకోవద్దు

ABN , Publish Date - May 31 , 2024 | 10:45 PM

జాతీయ రహదారి నిర్మాణానికి అలైన్‌మెంట్‌ మార్చి తమ పంట భూములు తీసుకొని పొట్ట కొట్టొద్దని పలువురు రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బాధిత రైతులతో కలిసి బీజేపీ సీనియర్‌ నాయకుడు తుల మధుసూదన్‌రావు, రిటైర్డు నీటిపారుదల శాఖ సూపరిండెంటెంట్‌ ఇంజనీర్‌ నారపరెడ్డి మాట్లాడారు

Manchiryāla-   పంట భూములు తీసుకోవద్దు
మాట్లాడుతున్న నిర్వాసితులు

ఏసీసీ, మే 31: జాతీయ రహదారి నిర్మాణానికి అలైన్‌మెంట్‌ మార్చి తమ పంట భూములు తీసుకొని పొట్ట కొట్టొద్దని పలువురు రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బాధిత రైతులతో కలిసి బీజేపీ సీనియర్‌ నాయకుడు తుల మధుసూదన్‌రావు, రిటైర్డు నీటిపారుదల శాఖ సూపరిండెంటెంట్‌ ఇంజనీర్‌ నారపరెడ్డి మాట్లాడారు. లక్షెట్టిపేట నుంచి గద్దెరాగడి వరకు ఎన్‌హెచ్‌ 63లో భాగంగా నిర్మించనున్న బ్రౌన్‌ఫీల్డ్‌ హైవే పాత అలైన్‌మెంట్‌నే ఖాయం చేయాలని కోరారు. నేషనల్‌ హైవే అధారిటీ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. పెట్టుబడిదారులకు పైరవీకారులకు అనుకూలంగా రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారని ఆరోపించారు. మంచిర్యాల ఆర్డీవో ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ, అభ్యంతరాలు, ఫిర్యాదులు తీసుకోలేదన్నారు. మార్చి 12న ఓపెన్‌ కోర్టు పేరిట అభ్యంతరాలను నమోదు చేయకుండా నామమాత్రంగా నిర్వహించారన్నారు. వందల మంది రైతులు ఆర్డీవో కార్యాలయం వద్దకు వస్తే కేవలం ఒకరిద్దరితోనే మాట్లాడుతానని ఆర్డీవో చెప్పడంతో రైతులు ఓపెన్‌కోర్టును బహిష్కరించి రోడ్డుపై ధర్నా చేపట్టి రాస్తారోకో చేశారన్నారు. రైతలందరు సంతకాలు చేసి మూకుమ్మడిగా ప్రస్తుతం ఉన్న ఎన్‌హెచ్‌ 63పైనే బ్రౌన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించాలని వినతి పత్రం ఇచ్చినా ఆర్డీవో పట్టించుకోలేదన్నారు. 2018లో చేసిన సర్వేలను రద్దు చేసి కొంత మంది ఆస్తులను కాపాడడానికే అలైన్‌మెంట్‌ మార్చారని ఆరోపించారు. కొత్త అలైన్‌మెంట్‌ ప్రకారం రోడ్డు నిరిస్తే రైతుల పంట భూములు నష్టపోతారన్నారు. భూసేకరణ, రోడ్డు నిర్మాణానికి రూ. 3 నుంచి 4 వేల కోట్ల నిధులు అవస రం అవుతాయని, ప్రస్తుతం ఉన్న ఎన్‌హెచ్‌ 63పైన నిర్మిస్తే 1,500 కోట్లతోనే నిర్మాణం పూర్తవు తుందని తెలిపారు. రాయపట్నం నుంచి మంచిర్యాల వరకు ప్రస్తుతం 40 మీటర్ల వెడల్పు రోడ్డు ఉందని, గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌కు మరో 5 మీటర్లు భూసేకరణ చేపడితే సరిపోతుందన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డునే గ్రీన్‌ఫీల్డ్‌ హైవేగా మారిస్తే విలువైన భూములు, ఇళ్లు కోల్పోవాల్సిన అ వసరం ఉందని, అధికారులు మొండిగా వ్యవహరిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెట్టం తిరుపతి, రాజమౌళి, మల్లేష్‌, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 10:45 PM