దేవుడి పేరుతో రాజకీయం చేయొద్దు
ABN , Publish Date - Jan 23 , 2024 | 03:24 AM
బీజేపీ నేతలు దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేయడాన్ని
పదేళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసిందేంటి..?: పొన్నం
హైదరాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేతలు దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘నేను జన్మతః హిందువుని.. నిన్న, ఈరోజు గుడికి పోయా.. రేపు గుడికి పోతా.. నుదుట బొట్టు పెట్టుకుంటా.. దేవుడంటే భక్తి, భయం, శ్రద్ధ ఉంది. మీరు చెప్పినట్టు వినకపోతే నేను హిందువుని కాదా...? దేవుడి ఫొటోలు పెట్టి రాజకీయం చేయొద్దు’అని సోమవారం ‘ఎక్స్’లో మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, మా ప్రజలకు గత 10 ఏళ్లలో ఏంచేశారో చెప్పండి అని బీజేపీ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు.