Share News

ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో కుల పాలన చేయొద్దు

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:52 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపులో కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్యం చూపుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ విమర్శించారు.

ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో కుల పాలన చేయొద్దు
మునుగోడులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివా్‌సగౌడ్‌

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌

మునుగోడు, మార్చి 28: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపులో కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్యం చూపుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కులపాలన సాగించే యత్నాలు చేయవద్దని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బీసీలపై వివక్ష చూపుతోందన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆచరణలో మాత్రం వాటన్నింటినీ విస్మరిస్తోందని విమర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 34సీట్లు ఇస్తామని మాట తప్పని అన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ బీసీలపై వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందన్నారు. కులగణన చేపట్టాలని రాహుల్‌గాంధీ, సోనియాగాంఽధీ ప్రకటించి బీసీలపై అనుకూలమైన వైఖరి చూపారని, వారిపేరుతో చెలామణి అవుతూ వారి ఉద్దేశాలు అమలు చేయకపోవటం ఏమిటని ప్రశ్నించారు. ఇది మోసపూరిత విధానమన్నారు. ఇప్పటికైనా బీసీల వివక్షత చూపే వైఖరి మార్చుకోవాలన్నారు. అగ్రకులాలకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణ వర్గాలకు సైతం జనాభా ప్రకారం చట్ట సభలో సమూచిత స్థానం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బూడిద లింగయ్యయాదవ్‌, నాయకులు మేకల మల్లయ్య, బొల్లం వెంకన్న, జాజుల భాస్కర్‌, వెంకటేశం, సత్యనారాయణ, గురిజ నర్సింహా, కైలాసం గౌడ్‌, ఆవుల శ్రీను, రాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:52 PM