8 వరకు శివానందరెడ్డిని అరెస్టు చేయొద్దు: హైకోర్టు
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:30 AM
భూ కబ్జా కేసులో నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఐపీఎస్ మాండ్ర శివానందరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను ఈనెల 8వ తేదీ వరకు అరెస్టు చేయరాదని తెలంగాణ హైకోర్టు మధ్యంతర

హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): భూ కబ్జా కేసులో నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఐపీఎస్ మాండ్ర శివానందరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను ఈనెల 8వ తేదీ వరకు అరెస్టు చేయరాదని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో 26 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమ పత్రాలు సృష్టించి కబ్జాచేశారనే ఆరోపణలపై శివానందరెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్కపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తమపై ఎలాంటి కఠినచర్యలు తీసుకుకోకుండా చూడాలని శివానందరెడ్డి, కుటుంబ సభ్యులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రాగా.. ఈ నెల 8వ తేదీ వరకూ వారిని అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.