Share News

వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవం

ABN , Publish Date - Mar 16 , 2024 | 11:15 PM

పట్టణ పరిధిలోని నదీ అగ్రహారం వేంకటేశ్వర స్వామి ఆలయం లో శనివారం ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు.

 వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవం

- వేర్వేరుగా పూజల్లో పాల్గొన్న

జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత,

మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌

గద్వాల/గద్వాల టౌన్‌, మార్చి 16: పట్టణ పరిధిలోని నదీ అగ్రహారం వేంకటేశ్వర స్వామి ఆలయం లో శనివారం ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత హాజరై స్వా మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు తీర్థప్రసాదాలను అందించి సత్కరించారు. పురాతన ఆలయ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నిర్వాహకులను ఆమె అభినందించారు. ఆల య అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు నాగేంద్రయాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, కేకే వెంకటన్న, జయన్న, పరుషరాముడు, సమీ, తిరుపతన్న, బోయ వెం కటేష్‌, మల్దకంటి, దామోదర్‌ పాల్గొన్నారు. అ లాగే గద్వాల మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ పట్టణ సమీపంలోని నదీ అగ్రహారంలోని లక్ష్మీ వేంక టేశ్వర స్వామి ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కా ర్యక్రమంలో కౌన్సిలర్లు నరహరి శ్రీనివాసులు, శ్రీని వాస్‌ ముదిరాజ్‌, నరహరి గౌడ్‌, మహేష్‌కుమార్‌, శ్రీమన్నారాయణ, కృష్ణ, బీఆర్‌ఎస్‌ నాయకులు కోటేష్‌, రంజిత్‌కుమార్‌, రామకృష్ణశెట్టి ఉన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

మల్దకల్‌: గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సరితమ్మ వైద్యసిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పాల్వాయి గ్రామంలో పల్లె దవాఖానాలో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ను జడ్పీ చైర్‌పర్సన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీరోజు సమయపాలన పాటిస్తూ ఆరోగ్య విషయంపై ప్రజలకు తగు సూచనలు, సలహాలు ఇస్తూ వైద్య సేవలందించాలని డాక్టర్‌ నవీన్‌కు సూచించారు. ఆమె వెంట కాంగ్రెస్‌ నాయకులు రాజశేఖర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, నాగేంద్ర యాదవ్‌, భాస్కర్‌రెడ్డి, శివ, ముని, రామకృష్ణ, రవి, నరసింహులు, చంద్రన్న, శివయ్య, రవి పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 11:15 PM