Share News

Manchiryāla- అయోధ్యకు తరలివెళ్లిన భక్తులు

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:02 PM

మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం రాత్రి ప్రత్యేక రైలులో రామభక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ముందుగా మంచిర్యాల పట్టణంలో బీజేపీ నాయకులు, రామభక్తులు జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ ఆధ్వర్యంలో వెంకటేశ్వర టాకీస్‌ చౌరస్తా నుంచి ముఖరాం చౌరస్తా మీదుగా రైల్వేస్టేషన్‌ వరకు ర్యాలీగా శోభాయాత్ర నిర్వహించారు.

Manchiryāla-     అయోధ్యకు తరలివెళ్లిన భక్తులు
ర్యాలీ నిర్వహిస్తున్న రామభక్తులు, బీజేపీ నాయకులు

ఏసీసీ, ఫిబ్రవరి 13: మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం రాత్రి ప్రత్యేక రైలులో రామభక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ముందుగా మంచిర్యాల పట్టణంలో బీజేపీ నాయకులు, రామభక్తులు జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ ఆధ్వర్యంలో వెంకటేశ్వర టాకీస్‌ చౌరస్తా నుంచి ముఖరాం చౌరస్తా మీదుగా రైల్వేస్టేషన్‌ వరకు ర్యాలీగా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్రకార్యదర్శి ప్రదీప్‌కుమార్‌, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి , రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జీ కందుల సంధ్యారాణి, పెద్దపల్లి పార్లమెంట్‌ కన్వీనర్‌ వెంకటేశ్వర్‌గౌడ్‌, రఘునాథ్‌ జెండా ఊపి రైలును ప్రారంభించారు. రఘునాధ్‌ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష అయిన అయోధ్య రామమందిరం ప్రధాని కృషితోనే సాకారమైందన్నారు. అయోధ్య రాముడిని భక్తులందరు దర్శించుకోవాలని కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసి రాముడి దర్శనం కల్పించనున్నామని చెప్పారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రైలును ఏర్పాటు చేస్తామని, భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - Feb 13 , 2024 | 11:02 PM