Share News

శబరిమల పాదయాత్రను ప్రారంభించిన భక్తులు

ABN , Publish Date - Oct 15 , 2024 | 01:14 AM

రాయికల్‌ మండలానికి చెందిన ముగ్గురు అయ్యప్ప దీక్షాపరులు సోమవారం శబరిమలకు పాదయాత్రను ప్రారంభించారు. ఒడ్డెలింగాపూర్‌ గ్రామా నికి చెందిన యాచమనేని దీపక్‌, భూపతిపూర్‌ గ్రామానికి చెందిన ముక్కెర నరేందర్‌, రామా జీపేట గ్రామానికి చెందిన మామిడిపెల్లి లక్ష్మణ్‌లు రాయికల్‌ పట్టణ కేంద్రంలోని అ య్యప్ప స్వామి దేవాలయంలో దీక్ష స్వీకరించారు. అనంతరం పాదయాత్రకు బయలుదేరారు.

శబరిమల పాదయాత్రను ప్రారంభించిన భక్తులు

రాయికల్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాయికల్‌ మండలానికి చెందిన ముగ్గురు అయ్యప్ప దీక్షాపరులు సోమవారం శబరిమలకు పాదయాత్రను ప్రారంభించారు. ఒడ్డెలింగాపూర్‌ గ్రామా నికి చెందిన యాచమనేని దీపక్‌, భూపతిపూర్‌ గ్రామానికి చెందిన ముక్కెర నరేందర్‌, రామా జీపేట గ్రామానికి చెందిన మామిడిపెల్లి లక్ష్మణ్‌లు రాయికల్‌ పట్టణ కేంద్రంలోని అ య్యప్ప స్వామి దేవాలయంలో దీక్ష స్వీకరించారు. అనంతరం పాదయాత్రకు బయలుదేరారు.

మెట్‌పల్లి టౌన్‌: మెట్‌పల్లి నుంచి శబరిమల మహా పాదయాత్రను సోమవారం పట్టణా నికి చెందిన అయ్యప్ప స్వాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రోత్సవాల నిర్వహిం చి స్వాములకు ఇరుముడి కట్టారు. మెట్‌పల్లి వైస్‌ ఎంపీపీ పోతుగంటి రాజేంధర్‌స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్ష పరులు శబరిమల మహాపాదయాత్రకు బయలుదేరారు. అయ్యప్ప స్వామి ఆలయంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సతీమణి కల్వ కుం ట్ల సరోజన అయ్యప్ప స్వాములను కలసి క్షేమంగా వెళ్లిరావాలని కోరుతూ వారికి పది వేల ఆర్థి క సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దీక్ష పరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 01:14 AM