భక్తులకు సదుపాయాలు కల్పించాలి
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:02 PM
లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్ర హ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు సదుపాయాలు క ల్పించాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ సూ చించారు.
- అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్
- ఏర్పాట్లపై సమీక్ష
జడ్చర్ల, ఫిబ్రవరి 6 : లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్ర హ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు సదుపాయాలు క ల్పించాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ సూ చించారు. మంగళవారం జడ్చర్ల తహసీల్దార్ కార్యా లయంలో అధికారులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల క మిటీ సభ్యులు, గ్రామస్థులతో సమావేశం నిర్వహిం చారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా రథోత్సవం, శకటోత్సవం రోజున అత్యధిక సంఖ్యలో భక్తులు వ స్తారని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలని, ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని, బం దోబస్తు నిర్వహించాలని సూచించారు. సీసీ కెమె రాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చే యాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు నిలిపేం దు కు పార్కింగ్ స్థలం కేటాయించాలని పేర్కొన్నారు. భక్తులు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యం అం దించేందుకు వైద్యబృందం అందుబాటులో ఉం డాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ సత్యనా రాయణరెడ్డి, జడ్చర్ల మునిసిపల్ కమిషనర్ మహ మూద్‌షేక్, జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, దేవాలయ ఈవో దీప్తిరెడ్డి, ఎంపీవో జగదీశ్వర్, ఎక్సైజ్ శాఖ ఎస్‌ఐ సృజన్‌కుమార్, విద్యుత్‌శాఖ ఏఈ కిరణ్, గంగా పురం గ్రామకార్యదర్శి శ్రీనివాస్, గ్రామస్థులు జనార్దన్‌రెడ్డి, గోపాల్, బ్రహ్మం, ఆర్టీసీ, మిషన్ భగీరథ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి
మహబూబ్‌నగర్ (కలెక్టరేట్): ఇతర ప్రాంతాల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చి ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికులకు భద్రతతో పాటు, పనిచేస్తున్న చోట అవవసరమైన అన్ని సౌకర్యాల ను కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ఇటుక బట్టీలలో పని చేసే కార్మికులకు కనీస వేతనాలతో పాటు, వా రు నివసించే చోట తాగునీరు, టాయిలెట్లు, సరైన వసతి వంటి కనీస సౌకర్యాలను కల్పించాల్సిన బా ధ్యత యాజమానులపై ఉందన్నారు. 14 సంవత్స రాల కన్నా తక్కువ వయసున్న పిల్లలను ఎట్టి పరి స్థితులలో పని చేయించుకోవద్దని, ఈవిషయంపై ఇటుక బట్టి కార్మికుల యజమానులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్మిక శాఖ జిల్లా ఉపకమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్, అసిస్టెంట్ కమిషనర్ యాదయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జ్యోతి, సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గన్నోజి చంద్రశేఖర్, షాకీర్ పాల్గొన్నారు.