అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:26 PM
జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, జూలై 5: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్లైఓవర్ , ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణాల పనుల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆసుపత్రి, కళాశాలలకు అవసరమైన సదుపాయాల కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా త్వరలో ప్రారంభించుకోనున్న ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలతో పాటు నీటివసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్లైఓవర్ నిర్మాణం పనులపై ఆర్‌అండ్‌బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీవో వాసు చంద్ర, ఆర్‌అండ్‌బీ ఈఈ లాల్‌సింగ్, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, ఆర్‌అండ్‌బీ డీఈ, ఈఈలు ఉన్నారు.