దేవరకద్ర ఎమ్మెల్యేకు పలువురి పరామర్శ
ABN , Publish Date - Sep 11 , 2024 | 11:20 PM
దేవరకద్ర ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూద న్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు గ్రామానికి వచ్చి ఎమ్మెల్యేను పరామర్శిస్తున్నారు.
-కలెక్టర్ విజయేందిర, తెలంగాణ క్రీడా శాఖ సలహాదారు జితేందర్‌రెడ్డి
చిన్నచింతకుంట, సెప్టెంబరు 11 : దేవరకద్ర ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూద న్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు గ్రామానికి వచ్చి ఎమ్మెల్యేను పరామర్శిస్తున్నారు. బుధవారం మండలంలోని దమగ్నాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, రాష్ట్ర క్రీడల శాఖ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా నాయకులు ఆదిత్యరెడ్డి, ఆర్‌టీసీ నాయకుడు అశ్వత్తామరెడ్డితో పాటు ఆయా గ్రామాలకు చెందిన రాజకీయ పార్టీల నాయకులు అక్కల సుదర్శన్‌గౌడ్, ఊషన్నాగౌడ్, రవిగౌడ్, కార్యకర్తలు కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళ్లర్పించారు. జీఎంఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.