Share News

డొక్కు బస్సులు.. తప్పని అవస్థలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:30 PM

కాలం చెల్లిన డొక్కు బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ డొక్కు బస్సులను నడపడంతో వికారాబాద్‌ అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ప్రజలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.

డొక్కు బస్సులు..  తప్పని అవస్థలు

వికారాబాద్‌, ఏప్రిల్‌ 25 : కాలం చెల్లిన డొక్కు బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ డొక్కు బస్సులను నడపడంతో వికారాబాద్‌ అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ప్రజలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. గురువారం తాండూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఘాట్‌రోడ్డు ఎక్కలేక ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు బస్సు దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా వికారాబాద్‌, తాండూరు, పరిగి డిపోలకు కొత్త బస్సులను అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:30 PM