రైతుల వివరాలు నమోదు చేయాలి
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:09 AM
ధాన్యం విక్రయించే రైతుల వివరాలను కొనుగోలు కేంద్రాల్లో నమోదు చేయాలని అసిస్టెంట్ రిజిస్ట్రార్ షణ్ముకచారి అన్నారు.

చిట్యాల రూరల్, ఏప్రిల్ 2: ధాన్యం విక్రయించే రైతుల వివరాలను కొనుగోలు కేంద్రాల్లో నమోదు చేయాలని అసిస్టెంట్ రిజిస్ట్రార్ షణ్ముకచారి అన్నారు. మండలంలోని వట్టిమర్తి, ఉరుమడ్ల, ఎలికట్టె, నేరడ గ్రామాల్లో పీఏసీఎప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా నిర్మాహకులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని తూకం వేయాలన్నారు. ధాన్యం తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. కార్య క్రమంలో విజయకృష్ణ, మనీషా, రమేష్, వికాస్, బ్రహ్మచారి, నాగరాజు, వెంకటేశ్వర్లు, నర్సిరెడ్డి, నరేష్, సైదులు, పెంటయ్య, శ్రీశైలం, పాల్గొన్నారు.
మునుగోడు రూరల్: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీఎం డి. మైసేశ్వరరావు అన్నారు. మండలంలోని కొంపల్లి గ్రామంలో మంగళవారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు రాములమ్మ, శ్యామలా, ఏఈవో యాదగిరి, సీసీ అంజయ్య, వీవోఏ పద్మ, ఇందిరా, లావణ్య కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
గుర్రంపోడు: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఐకేపీ ఏపీఎం ఊరుపక్క యాదయ్య అన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో మండలంలోని కాచారం, చామలోనిబావి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు తరి ఉమారాణి, ఆడెపు రేణుక, సీసీలు రాజేశ్వరి, శేఖర్ ఉన్నారు.
కనగల్: తాగునీటి అవసరాల కోసమే ఏఎమ్మార్పీ కాల్వకు ప్రభుత్వం సాగర్ నీటిని విడుదల చేసిందని నల్లగొండ ఆర్డీవో రవి తెలిపారు. మండ లంలోని కురంపల్లి వద్ద ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వను స్థానిక అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. కాల్వకు అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ పంపుసెట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. తక్షణ చర్యగా సదరు మోటర్లకు విద్యుత్‌సరఫరాను నిలిపివేయించారు. కాగా వేసవి తాగునీటి ఎద్దడి నివారణలో భాగంగా ప్రభుత్వం ఉదయ సముద్రం చెరువుకు నీటిని విడుదల చేసిందన్నారు. మిషన్‌భగీరధ నీటిని గ్రామాలకు సరఫరా చేసేందుకు చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవటంతో ఉదయ సముద్రం చెరువుకు నీటి తరలింపు చేపట్టినట్టు పేర్కొన్నారు. తాగు నీటి అవసరాల కోసం ఉద్దేశించిన నీటిని అక్రమంగా కాల్వగేట్లు ఎత్తి ఇతర అవసరాలకు తరలిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పద్మ, ఐబీ డీఈ సురేష్ పాల్గొన్నారు.
ధాన్యం కోనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
చిట్యాల: చిట్యాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి ఎండీ. అక్బర్ డిమాండ్ చేశారు. చిట్యాల మార్కెట్ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ధాన్యం కోనుగోలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ, ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోతున్నారన్నారు. తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎస్‌కె షరీఫ్, బొ ల్గూరి లింగయ్య, రావుల చినవెంకన్న, గుండాల సత్తయ్య, మేకల బిక్షం, కడగంచి రామలింగయ్య, బాల్‌రెడ్డి, దామనూరి అంజయ్య పాల్గొన్నారు.