Share News

ప్రతీ ఖర్చు వివరాలు నమోదు చేయాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:23 PM

పార్లమెంట్‌ ఎ న్నికల్లో పోటీ చేస్తున్న అ భ్యర్థుల ఖర్చుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయా లని ఎన్నికల వ్యయ పరిశీల కులుగా వరుణ్‌ రంగస్వామి ఆదేశించారు.

ప్రతీ ఖర్చు వివరాలు నమోదు చేయాలి
వివరాలను పరిశీలిస్తున్న వరుణ్‌రంగస్వామి

- ఎన్నికల వ్యయ పరిశీలకుడు వరుణ్‌ రంగస్వామి

నారాయణపేటటౌన్‌, ఏ ప్రిల్‌ 19: పార్లమెంట్‌ ఎ న్నికల్లో పోటీ చేస్తున్న అ భ్యర్థుల ఖర్చుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయా లని ఎన్నికల వ్యయ పరిశీల కులుగా వరుణ్‌ రంగస్వామి ఆదేశించారు. లోక్‌సభ ఎన్ని కల నేపథ్యంలో మహబూబ్‌ నగర్‌ పార్లమెంటరీ పరిధి లోని నారాయణపేట, మక్త ల్‌ అసెంబ్లీ నియోజకవర్గా ల్లో ఎన్నికల ప్రచార ఖర్చులను పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్‌ నియమించిన ఎన్నికల వ్యయ పరిశీలకుడు వరుణ్‌ రంగస్వామి జిల్లాకు చేరుకున్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు మయాంక్‌ మిత్తల్‌, అశోక్‌కుమార్‌, ఎస్పీ యోగేష్‌గౌతమ్‌ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చుల నమోదు కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వేలెన్సు, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్‌ బృందాలు, మీడియా సెంటర్‌, ఎలక్ర్టానిక్‌ అండ్‌ సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌తో పాటు కంట్రోల్‌ రూమ్‌, గ్రివ్సెన్‌ కమిటీ వాటి పనితీరును ఆయన పరిశీలించారు. గ్రీవెన్స్‌ కమిటీలో పట్టుకున్న నగదు వివరాలను ఎన్నికల పరిశీలకులకు జడ్పీ ఇన్‌చార్జి సీఈవో జ్యోతి వివరించారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్‌, అదనపు డీఆర్‌డీఏ అంజయ్య, ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:23 PM