Share News

అర్హులైన పేదలకు ఇళ్లు అందేలా చూడాలి

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:36 AM

ప్రజాపాలనలో ఇం డ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హు లైన నిరుపేదలకు ఇళ్లు అందేలా చూ డాలని జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్‌ప ర్సన్‌ దావ వసంత సురేష్‌ అన్నారు. అర్హులైన లబ్దిదారులతో కలిసి కలెక్టరే ట్‌కు చేరుకొని అడిషనల్‌ కలెక్టర్‌కు వి నతిపత్రం అందించి, అర్హత ఆధారం గా ఇళ్లు అందేలా చూడాలని కోరారు.

అర్హులైన పేదలకు ఇళ్లు అందేలా చూడాలి

జగిత్యాల అగ్రికల్చర్‌, డిసెంబరు 28(ఆంరఽధజ్యోతి): ప్రజాపాలనలో ఇం డ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హు లైన నిరుపేదలకు ఇళ్లు అందేలా చూ డాలని జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్‌ప ర్సన్‌ దావ వసంత సురేష్‌ అన్నారు. అర్హులైన లబ్దిదారులతో కలిసి కలెక్టరే ట్‌కు చేరుకొని అడిషనల్‌ కలెక్టర్‌కు వి నతిపత్రం అందించి, అర్హత ఆధారం గా ఇళ్లు అందేలా చూడాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత ఆరుగ్యారంటీల అమలులో భాగంగా ప్రజాపాలన కా ర్యక్రమం పేరుతో అర్హులైన వారి నుంచి వివిథ పథ కాల అర్హత నిమిత్తం దరఖాస్తులు స్వీకరించారని గుర్తుచేశారు. వీటిని కాగితాలకే పరిమితం చేయకుం డా క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి అర్హులైన వారికి ఫథకాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశా రు. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసే క్రమంలో తప్పులు దొర్లాయని అర్హులైన వారి వివరాలు సరిగా నమొదు కానందున ప్రభుత్వం, అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్‌పర్సన్‌ శీలం ప్రియాంక ప్రవీణ్‌, బీఆర్‌ఎస్‌ బాధ్యులు ఆ నందరావు, తుమ్మ గంగాధర్‌, అనిల్‌, మల్లేశం, స్పం దన, గంగారెడ్డి, రత్నాకర్‌రావు, హన్మండ్లు, మహేష్‌, గంగారాం, లక్ష్మణ్‌రావు, హరీష్‌, బాలెచందు, సంహిత్‌రావు తదితరులున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:36 AM