Share News

డెంగీ నివారణ మనందరి బాధ్యత

ABN , Publish Date - May 17 , 2024 | 12:17 AM

డెంగీని అరికట్టడం మనందరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్‌ కుమార్‌ అన్నారు.

డెంగీ నివారణ మనందరి బాధ్యత
డెంగీ నివారణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో పాల్వన్‌ కుమార్‌

డీఎంహెచ్‌వో పాల్వన్‌ కుమార్‌

వికారాబాద్‌, మే 16: డెంగీని అరికట్టడం మనందరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్‌ కుమార్‌ అన్నారు. గురువారం జాతీయ డెంగీ నివారణ దినం సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీ డీఎంహెచ్‌వో జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 2030 నాటికి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నిర్మూలించడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన పెరగడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మెరుగుతో డెంగీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. దోమల పెరుగుదలను అరికట్టడానికి నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో జీవరాజ్‌, డాక్టర్‌ రవీంద్ర యాదవ్‌, డాక్టర్‌ సాయిబాబా సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:17 AM