Share News

Manchiryāla- డిమాండ్లు పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:27 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో సంతోషకరమైన విషయం అయినప్పటికీ తమకు ఉపా ధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ఆటో యూనియన్‌ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్‌ శ్రీనివాస్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

Manchiryāla-       డిమాండ్లు పరిష్కరించాలి
నస్పూర్‌లో తహసీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న అటో యూనియన్‌ నాయకులు

నస్పూర్‌, ఏప్రిల్‌ 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో సంతోషకరమైన విషయం అయినప్పటికీ తమకు ఉపా ధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ఆటో యూనియన్‌ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్‌ శ్రీనివాస్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా ఆటోలకు గిరాకి తగ్గిందన్నారు. ఫలితంగా ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్ల కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. ప్రభుత్వం డ్రైవర్లకు పెన్షన్‌ మంజూరు చేయాలన్నారు. ఆటో బీమా ద్వారా 5లక్షలు ఇవ్వాల న్నారు. డ్రైవర్లకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ల వేధింపులను అరికట్టాలన్నారు. అటో కార్మికులకు 80శాత బ్యాంకుల ద్వారా రుణ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ తమ సమస్యలను పరిష్కరించి ఆదు కోవాలని యూనియన్‌ నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసీ పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జీ చెల్ల విక్రమ్‌, కమిటీ సభ్యులు సుధాకర్‌, పట్టణ అటో యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

కాసిపేట ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని బుధవారం తహసీల్దార్‌ భోజన్నకు ఆటో యూనియన్‌ నాయకులు వినతి పత్రం అందించారు. ఆటో యూనియన్‌ నాయకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆటోలకు గిరాకీ లేక పస్తులుంటు న్నామన్నారు. కుటుంబాలను పోషించలేక ఇప్పటి వరకు 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్‌ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రామారావు, రాయలింగు, దుర్గయ్య, గోపాల్‌, పోశం, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

కన్నెపల్లి: ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం తహసీ ల్దార్‌ కార్యాలయంలో ఆటో యూనియన్‌ నాయకులు వినతి పత్రం అందించారు. ఆటో యూనియన్‌ నాయకుడు సత్యనారాయణ, సతీష్‌, రఘులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మీ పథకం ద్వారా ఆటోలకఉ గిరాకీ లేక పస్తులుం టున్నామన్నారు. కుటుంబాలను పోషించలేక ఇప్పటి వరకు 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్‌ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

తాండూర్‌: ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మం డల ఆటోయూనియన్‌ నాయకులు బుధవారం ఆర్‌ఐకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మొహ్మద్‌ హబీబ్‌పాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:27 PM