Share News

సౌత్‌జోన్‌ డీసీపీ సాయి చైతన్యపై ఈసీ వేటు

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:59 AM

హైదరాబాద్‌ సౌత్‌జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు(డీసీపీ) పి.సాయి చైతన్యపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయన్ను ఆ పోస్టు నుంచి

సౌత్‌జోన్‌ డీసీపీ సాయి చైతన్యపై ఈసీ వేటు

బదిలీ చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు

బీజేపీ ఫిర్యాదుకు స్పందన

హైదరాబాద్‌, చార్మినార్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సౌత్‌జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు(డీసీపీ) పి.సాయి చైతన్యపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయన్ను ఆ పోస్టు నుంచి బదిలీ చేయాలంటూ ఈసీ ఆదేశించిన మీదట బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. తన కింది స్థాయి అధికారికి బాధ్యతలను అప్పగించాలంటూ సాయి చైతన్యను ఆదేశించారు. సాధారణ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దంటూ డీజీపీకి సూచించారు. సాయి చైతన్య ఎంఐఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఇటీవల బీజేపీ చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించి, ఈ బదిలీ వేటు వేసింది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు రేపటిలోగా ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపాలని ప్రధాన కార్యదర్శిని ఈసీ కోరింది.

Updated Date - Apr 25 , 2024 | 03:59 AM