Share News

సీబీఐ జేడీగా దాట్ల శ్రీనివాస వర్మ

ABN , Publish Date - Jan 03 , 2024 | 04:04 AM

తెలుగు ఐపీఎస్‌ అధికారి దాట్ల శ్రీనివాస వర్మ సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

సీబీఐ జేడీగా దాట్ల శ్రీనివాస వర్మ

హైదరాబాద్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): తెలుగు ఐపీఎస్‌ అధికారి దాట్ల శ్రీనివాస వర్మ సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఈయన ఇప్పటి వరకు అక్కడి హోంశాఖలో అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. కేంద్ర కేబినెట్‌ అపాయింట్‌మెం ట్‌ కమిటీ ఆయన్ను సీబీఐ జేడీగా నియమిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 04:04 AM