Share News

బస్సు టికెట్‌తోపాటే శ్రీశైలంలో దర్శనం బుకింగ్‌

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:26 AM

శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక రిజర్వేషన్‌ ఏర్పాట్లు చేయనుంది. బస్సు సీటు రిజర్వేషన్‌తో పాటే

బస్సు టికెట్‌తోపాటే శ్రీశైలంలో దర్శనం బుకింగ్‌

రోజుకు 1,200 మందికి.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక రిజర్వేషన్‌ ఏర్పాట్లు చేయనుంది. బస్సు సీటు రిజర్వేషన్‌తో పాటే స్వామివారి దర్శనానికి టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్పర్శ దర్శనానికి 200 మంది, అతిశీఘ్ర దర్శనాలకు 500 మంది, శీఘ్ర దర్శనాలకు 500 మంది(మొత్తం 1200మందికి) ప్రయాణికులకు అవకాశం కల్పించేందుకు దేవస్థానంతో టీఎ్‌సఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసి దర్శన టిక్కెట్ల రిజర్వేషన్లు ప్రారంభించనున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 02:26 AM