Share News

సైబర్‌ నేరగాళ్లకు ‘బ్యాంకు ఖాతాల’ సాయం!

ABN , Publish Date - May 02 , 2024 | 05:11 AM

సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తున్న కీలక ఏజెంట్‌ను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నిర్మల్‌ జిల్లా భైంసాకు చెందిన ప్రణయ్‌ షిండే మరికొంత మందితో కలిసి ముఠా ఏర్పాటు

సైబర్‌ నేరగాళ్లకు ‘బ్యాంకు ఖాతాల’ సాయం!

ముఠాలోని కీలక నిందితుడి అరెస్టు

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తున్న కీలక ఏజెంట్‌ను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నిర్మల్‌ జిల్లా భైంసాకు చెందిన ప్రణయ్‌ షిండే మరికొంత మందితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. సైబర్‌ నేరగాళ్లకు అవసరమైన బ్యాంకు ఖాతాలు తెరిపించి ఇవ్వడం ఈ ముఠా పని.. ఇందుకోసం అమాయకులకు కమీషన్ల ఆశ చూపి 125కుపైగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన సైబర్‌ నేరాలకు సంబంధించిన నగదు నిర్మల్‌ జిల్లాలోని బ్యాంకు ఖాతాలకు మళ్లినట్లు గుర్తించి దర్యాప్తు జరపడంతో ముఠా గుట్టు బయటపడిందని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో చీఫ్‌ షీకా గోయల్‌ తెలిపారు.

Updated Date - May 02 , 2024 | 05:11 AM