Share News

యాదగిరికొండపై భక్తుల రద్దీ

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:42 AM

భువనగిరిఅర్బన, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదగిరి కొండపై సందడి నెలకొంది.

 యాదగిరికొండపై భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట ఆలయ ఆవరణంలో షెడ్డు కింద సేద తీరుతున్న భక్తుల రద్దీ

భువనగిరిఅర్బన, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదగిరి కొండపై సందడి నెలకొంది. ఆదివారం వారాంతపు సెలవురోజు కావడంతో 25వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లు భక్తులతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ప్రత్యేక దర్శనానికి గంట, ధర్మదర్శ నానికి రెండు గంటల సమయం పట్టింది. ప్రధానా లయం, కల్యాణోత్సవం, వ్రత మండ పాలు, ఆలయ తిరువీధులు, ప్రసాద విక్రయశాలల్లో వద్ద కూడా రద్దీగా మారాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.43,81,003 ఆదాయం సమకూరిందని ఆల య ఈవో ఏ.భాస్కర్‌రావు తెలిపారు. సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపిన అర్చకస్వాములు స్వయంభువులకు నిత్య పూజలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్య కల్యాణోత్సవ పర్వాలు వైభవంగా చేపట్టారు. పాతగుట్టలో స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు ఘనంగా చేపట్టారు. కొండపైన శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారికి నిత్య పూజలు, రుద్రహవన పూజలు, శైవాగమరీతిలో జరిపారు. రాత్రి మహానివేదన, శయనోత్సవాలతో ఆలయ ద్వారబంధనం చేశారు.

Updated Date - Oct 21 , 2024 | 12:42 AM