Share News

Kumaram Bheem Asifabad- వాగులు దాటేదెట్ల..

ABN , Publish Date - May 24 , 2024 | 10:57 PM

వర్షాకాలం వస్తే చాలు ఆ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నో ఏళ్లుగా వంతెన లేక పోవడంతో వాగు పరిసర గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లక్మాపూర్‌, అనార్‌పల్లి, సాంగ్వీ గ్రామాల వాగులు నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది

Kumaram Bheem Asifabad-    వాగులు దాటేదెట్ల..
అసంపూర్తిగా ఉన్న లక్మాపూర్‌ వంతెన

- మరమ్మతులకు నోచుకోని సాంగ్వీ వంతెన

- రాకపోకలకు గ్రామస్థుల అవస్థలు

కెరమెరి, మే 24: వర్షాకాలం వస్తే చాలు ఆ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నో ఏళ్లుగా వంతెన లేక పోవడంతో వాగు పరిసర గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లక్మాపూర్‌, అనార్‌పల్లి, సాంగ్వీ గ్రామాల వాగులు నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. దీంతో పలు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రాలేని దుస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతంలో ఎటు వైపు వర్షం కురిసినా వాగు నిండుగా ప్రవహిస్తుంది. ఆరేళ్ల క్రితం వంతెన మంజూరైనా నేటికీ పూర్తి కాలేదు. సుమారు రూ.2 కోట్ల చొప్పున వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. లక్మాపూర్‌ వంతెన నిర్మాణంలో ఉండగా అనార్‌పల్లి వంతెన పనులు మాత్రం నేటికీ పూర్తి కాక ఫిల్లర్ల దశలోనే పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాడైదనా పనులు పూర్తైతే తమ కష్టాలు తీసుతాయనే ఆశాభావంతో ప్రజలు ఉన్నప్పటికీ పనులు నత్తనడకన సాఉతుండడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగానే వంతెన నిర్మాణ నులు పూర్తి కావడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. లక్మాపూర్‌, అనార్‌పల్లి ఆమ్రాల సమీపంలోని వాగుకు అవతలి వైపు ఉన్న కరంజీవాడ, పెద్దకరంజీవాడ, జన్కాపూర్‌, బోరిలాల్‌గూడ, అందుగూడ, మహారాష్ట్ర సరహద్దులో కోట, పరందోళి, ముక్దాంగూడ, మహారాజ్‌గూడ, శంకర్‌లొద్ది తదితర ఆమ్రాల ప్రజలు పనుల నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గ్రామాల మీదుఆ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు సైతం రాక పోకలు సాగిస్తారు. వాగు ఉప్పొంగితే రోజుల తరబడి రాక పోకలు నిలిచి పోతాయి.

వర్షాకాలంలో ఇక్కట్లు..

చలి, వేసవి కాలాలు మండల కేంద్రానికి రాక పోకలు సాగించేందుకు అనుకూలంగానే ఉంటాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా ప్రజలు ఇళ్లకు చేరుకుంటారు. కానీ వర్షాకాలం మూడు నెలల పాటు వాఉలో నీటి ప్రవాహం ఎక్కువా ఉండి దాటేందుకు వీలు లేకుండా ఉంటుంది. వారసంతకు, నిత్యావసర సరుకుల కొనుఓలుకు, అత్యవసర సమయాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటాల్సి వస్తుంది. నీటి ప్రవాహం ఎక్కువా ఉన్న సమయంలో వాగు దాటుతూ ప్రమాదాల బారిన పడ్డ సందర్భాలు ఉన్నాయి.

మరమ్మతులకు నోచుకోని సాంగ్వీ వంతెన :

మండలంలోని సాంగ్వీ గ్రామ పంచాయతీ పరిధిలోని కర్పెతూడ, రావుజీగూడ గ్రామాలకు వంతెన కష్టాలు తప్పడం లేదు. వానాకాలం వచ్చిదంటే చాలు ఆ గ్రామాల వారికి ఇక్కట్లు తప్పవు. రావూజీగూడ సమీపంలోని పెద్ద ఒర్రెపై 2012లో వంతెన కట్టాల్సిన చోట కల్వర్టు కట్టారు. అది కూడా నాణ్యత లోపం కారణంగా రెండేళ్ల క్రితం వర్షాకాలం కొట్టుకు పోయింది. నాటి నుంచి వర్షాకాలంలో వంతెన కష్టాలు మొదలయ్యాయి. వర్షం పడితే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

సమస్యలను పట్టించుకోవడం లేదు..

- బానోత్‌ రాంప్రసాద్‌, లక్మాపూర్‌

మా సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదు. పలు మార్లు పాలకుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. వంతెన పనులు నిలిచి పోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని వంతెన పూర్తి చేయాలి. వంతెన పూర్తైతే మా కష్టాలు తీరుతాయి.

Updated Date - May 24 , 2024 | 10:57 PM