పదేళ్ల తర్వాత ఎండుతున్న పంటలు
ABN , Publish Date - Apr 06 , 2024 | 11:13 PM
రాష్ట్రంలోని రైతులకు నాణ్యమైన విద్యుత్ లేక మోటార్లు కాలిపోయి మూతబడిన మోటారు రిపేరు దుకాణాలు మళ్లీ తెరుచుకుంటున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు.
- తెరుచుకుంటున్న మోటారు రిపేరు దుకాణాలు
- రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి
- బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి
మిడ్జిల్(మహబూబ్‌నగర్), ఏప్రిల్ 6 : రాష్ట్రంలోని రైతులకు నాణ్యమైన విద్యుత్ లేక మోటార్లు కాలిపోయి మూతబడిన మోటారు రిపేరు దుకాణాలు మళ్లీ తెరుచుకుంటున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసింది ఏ ప్రభుత్వంలో లేదని అ ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. శనివారం జడ్చర్ల పట్టణంలోని తహాసీల్దార్ కార్యలయం ముందు చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మారెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో రైతుల వ్యవసాయ పొలంలో ఏ ఒక్కగుంట ఎండకుండ నాణ్యమైన విద్యుత్‌నిచ్చామని గుర్తు చేశారు. కాళేశ్వరం ఎంతో పెద్ద ప్రాజెక్టు అని, చిన్న రిపేరును చూపించి రైతులకు నీరివ్వకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రైతు బంధు ఎందుకు వేయలేదు, పంటరుణమాపీ ఎందుకు చేయలేదని, క్వింటాలుకు రూ. 500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. ఎండిన పంటల రైతులకు వెంటనే ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం అందజేయాలని, దీంతో పాటు రైతులు పండించిన ప్రతీ ధాన్యానికి క్వింటాళ్ల రూ. 500 అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, మునిసిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీరవీందర్, నాయకులు ప్రజాప్రతినిధులు పాలాది రామ్మోహన్, మురళి, ప్రణీల్‌చందర్, శ్రీకాంత్, ఇమ్ము, కరాటే శ్రీను, శంకర్‌నాయక్, రవి నాయక్, కృష్ణ, విజయ్, దర్శన్, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
హామీలను నిలబెట్టుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఆల
దేవరకద్ర : గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను, రైతులను మోసం చేసి అధికారం చేజిక్కించుకున్నదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పిలుపు మేరకు శనివారం దేవరకద్ర నియోజకవర్గంలోని ఎస్‌బీఐ బ్యాంక్ పక్కన ఏర్పాటు చేసిన నియోజకవర బీఆర్‌ఎ్‌స్ రైతు దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఎంతో పచ్చగా ఉండేదని, ఇప్పడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగు నెలల్లోనే కరువు కాలం వచ్చిందని అన్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీరు ఉన్నా పంటలకు అందించకా 500 ఎకరాల పంటలు ఎండిపోతుంటే ఎమ్మెల్యే చిత్తశుద్ధి లేనట్లుగా ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కటీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ప్రజలు గమనించి, ఇప్పటికైనా రైతులు, ప్రజలు గుర్తించాలని అన్నారు. పార్లీమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అన్నపూర్ణ, పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, మండల నాయకులు శ్రీకాంత్‌యాదవ్, కర్ణం రాజు, వెంకటేష్, బాలరాజు, భాస్కర్‌రెడ్డి, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.