Share News

కౌంటింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - May 27 , 2024 | 10:23 PM

జూన్‌ 4న జరుగనున్న మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా రిటర్నింగ్‌ అధికారి గౌతమ్‌ నియోజకవర్గ ఏఆర్‌లను ఆదేశించారు.

కౌంటింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌

జిల్లా రిటర్నింగ్‌ అధికారి గౌతమ్‌

మేడ్చల్‌ మే 27(ఆంధ్రజ్యోతి) : జూన్‌ 4న జరుగనున్న మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా రిటర్నింగ్‌ అధికారి గౌతమ్‌ నియోజకవర్గ ఏఆర్‌లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ లో మేడ్చల్‌, మల్కాజిగిరి, కుత్భుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గాల ఏఆర్‌ఓలతో కౌంటింగ్‌ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్‌ 4న జరుగుతున్న ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యల గురించి ఏఆర్‌ఓలకు కలెక్టర్‌ సూచనలు చేశారు. కౌంటింగ్‌ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టాలన్నారు. కౌంటింగ్‌కు కావాల్సిన టేబుల్స్‌ నియోజకవర్గాల వారీగా మేడ్చల్‌ 28, మల్కాజిగిరి 20, కుత్భుల్లాపూర్‌ 28, కూకట్‌పల్లి 20, ఉప్పల్‌ 20, ఎల్‌బీనగర్‌ 28, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ 14, పోస్టల్‌ బ్యాలెట్‌కు 20టేబుల్స్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆయా నియోజకవర్గాలకు కౌంటింగ్‌ హోళీ మేరీ కాలేజీలో నిర్వహించడం జరుగుతుందని, ఎల్‌బీన గర్‌ నియోజకవర్గానికి సంబంధించి సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో, కంటోన్మెంట్‌కు వెస్లీ కాలేజీలో కౌంటింగ్‌ కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని నియోజకవర్గాల పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ హోళీ మేరీ కాలేజీలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించాలని, మొబైల్‌ ఫోన్లు లోపలికి అనుమతించడం జరగదన్నారు. కౌంటింగ్‌ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కౌంటింగ్‌ హాల్‌లో టేబుల్స్‌ , సీసీ కెమెరాలు, విద్యుత్‌, ఇంటర్‌నెట్‌, ఫ్యాన్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్‌ సిబ్బందికి టీ, స్నాక్స్‌ , భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, డీఆర్‌ఓ హరిప్రియ, ఏఆర్‌ఓలు, ఎలక్షన్‌ సెల్‌ సూపరిండెంట్‌ రాజేశ్వర్‌రెడి ్డ, సంబదిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 10:23 PM