14 ఏళ్లుగా పెరగని కాస్మటిక్ చార్జీలు
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:52 AM
ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఏఐఎ్‌సఎఫ్ విమర్శించింది. 14 ఏళ్లుగా కాస్మటిక్ చార్జీలు పెంచడం లేదని బాలికలకు నెలకు

ప్రస్తుత ధరల ప్రకారం పెంచాలని ఏఐఎ్‌సఎఫ్ డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఏఐఎ్‌సఎఫ్ విమర్శించింది. 14 ఏళ్లుగా కాస్మటిక్ చార్జీలు పెంచడం లేదని బాలికలకు నెలకు రూ. 75, బాలురకు రూ. 50 మాత్రమే ఇస్తున్నారని వాటిని తక్షణమే పెంచాలని ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశంను కలిసి వినతి పత్రం అందజేశారు. కాస్మటిక్ చార్జీలతోపాటు మెస్ చార్జీలు పెంచాలని, బోధన ఫీజులను తక్షణమే విడుదల చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలకు సంబంధించిన డైట్ బిల్లులు పది నెలలుగా పెండింగ్‌లో ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి వివరించారు.