Share News

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి ఖాకీలు

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:54 AM

మాదాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎస్సై రంజిత్‌, కానిస్టేబుల్‌ విక్రమ్‌ రూ.30 వేలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. మాదాపూర్‌లోని సాయినగర్‌కు చెందిన ఎం.లక్ష్మణ్‌ కుమార్తె నాగజ్యోతి 60 గజాల్లో పక్కా భవన నిర్మాణం

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి ఖాకీలు

పట్టుబడ్డ మాదాపూర్‌ ఎస్సై, కానిస్టేబుల్‌

హైదరాబాద్‌ సిటీ/మోతీనగర్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): మాదాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎస్సై రంజిత్‌, కానిస్టేబుల్‌ విక్రమ్‌ రూ.30 వేలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. మాదాపూర్‌లోని సాయినగర్‌కు చెందిన ఎం.లక్ష్మణ్‌ కుమార్తె నాగజ్యోతి 60 గజాల్లో పక్కా భవన నిర్మాణం చేపట్టారు. దీనిపై అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన మహిళ జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన జీహెచ్‌ఎంసీ.. పోలీసుల సాయంతో నిర్మాణాన్ని కూల్చివేసింది. దీంతో లక్ష్మణ్‌ జీహెచ్‌ఎంసీని ఆశ్రయించగా 60 గజాల్లో చేపట్టే ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదని చెప్పడం గమనార్హం. ఈ కేసు దర్యాప్తు పేరుతో లక్ష్మణ్‌ను పోలీసుస్టేషన్‌కు పిలిపించిన మాదాపూర్‌ ఎస్సై రంజిత్‌ బెదిరింపులకు దిగాడు. రూ.లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ప్రాధేయపడగా రూ.50వేలకు అంగీకరించారు. ఈ విషయమై లక్ష్మణ్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శనివారం మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన లక్ష్మణ్‌ రూ.30 వేలు కానిస్టేబుల్‌ విక్రమ్‌కు ఇచ్చాడు. విక్రమ్‌ ఆ నగదును ఎస్సై రంజిత్‌కు ఇవ్వగా.. ఏసీబీ అధికారులు వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 03:54 AM