ప్రత్యేక అధికారులకు సహకరించాలి
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:32 AM
గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులకు ప్రజాప్రతినిధులు సహకరించాలని మండల పరిషత అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు కోరారు.
ప్రత్యేక అధికారులకు సహకరించాలి
మండల పరిషత అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
గుర్రంపోడు, ఫిబ్రవరి 5: గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులకు ప్రజాప్రతినిధులు సహకరించాలని మండల పరిషత అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు కోరారు. మండల కేం ద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశు ధ్య కార్యక్రమాలపై జరిగే స్పెషల్‌డ్రైవ్‌ను విజయవంతం చేయాలని అన్నారు. వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిషనభగీరథతో పాటు స్థానికంగా గ ల నీటి వనరులను వినియోగించుకుని నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. మండల వ్యవసాయాధికారి మాధవరెడ్డి మాట్లాడుతూ మూడెకరాల వరకు రైతబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. త్వరలో అందరూ రైతులకు రైతుబంధు ఖాతాల్లో పడనున్నట్లు పేర్కొన్నారు. మండల విద్యాధికారి తరి రాము మాట్లాడుతూ మన ఊరి మన బడి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేలా కార్యాచరణ రూపొందించిన ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తున్నామని అ న్నారు. సమావేశంలో సర్పంచులు లేకపోవడంతో అధికారుల ని వేదికలకే సమావేశం పరిమితమైంది. ఆయా శాఖలపై ప్రశ్నలు అడిగే వారే కరువయ్యారు.