Share News

మల్కాపూర్‌-విజయవాడ రహదారిని 6 లేన్లుగా మార్చండి

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:15 AM

ప్రస్తుత ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ - విజయవాడ జాతీయరహదారిని విస్తరించాలని, మల్కాపూర్‌ నుంచి 44 కి.మీ వరకు రహదారిని 6 లేన్లుగా మార్చాలని రాష్ట్ర రోడ్లు,

మల్కాపూర్‌-విజయవాడ రహదారిని 6 లేన్లుగా మార్చండి

ప్రధాని మోదీకి రోడ్లుభవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ - విజయవాడ జాతీయరహదారిని విస్తరించాలని, మల్కాపూర్‌ నుంచి 44 కి.మీ వరకు రహదారిని 6 లేన్లుగా మార్చాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని మోదీని కోరారు. రాష్ట్రంలో 1767 కి.మీ. మేర కలిగిన 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఉన్నతీకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రధానిని ఆయన సంగారెడ్డిలో కలిసి వినతి పత్రం అందించారు. హైదరాబాద్‌-శ్రీశైలం 765 కి.మీ.లలో 62 కి.మీ రహదారిని జాతీయరహదారిగా మార్చేందుకు సంబంధితశాఖకు డీపీఆర్‌ పంపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రీజినల్‌రింగ్‌రోడ్డులోని ఉత్తర భాగంలో ‘సంగారెడ్డి-తూప్రాన్‌-చౌటుప్పల్‌’ మార్గాన్ని జాతీయ రహదారి 161ఏఏగా గుర్తించడంతో పాటు, వికసిత్‌ భారత్‌-2047 పథకం కింద గుర్తించాలని, కాజీపేటలో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పీఎంను కోరారు.

Updated Date - Mar 06 , 2024 | 04:15 AM