వినియోగదారులు హక్కులను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Aug 17 , 2024 | 11:28 PM
వినియోగదారులు తమకు అనేక హక్కులు, చట్టా లు ఉన్నాయని, వినియోగించు కోవాలని జిల్లా కంజ్యూమర్స్ డిస్ప్యూట్స్ రిడ్రెసెల్ కమిషన్ చైర్మన్ ఎం. అనురాధ అన్నారు.
- జిల్లా కంజ్యూమర్స్ డిస్ప్యూట్స్ రిడ్రెసెల్ కమిషన్ చైర్మన్ ఎం. అనురాధ
మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 17 : వినియోగదారులు తమకు అనేక హక్కులు, చట్టా లు ఉన్నాయని, వినియోగించు కోవాలని జిల్లా కంజ్యూమర్స్ డిస్ప్యూట్స్ రిడ్రెసెల్ కమిషన్ చైర్మన్ ఎం. అనురాధ అన్నారు. శనివారం జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినియోగదారుల హక్కుల అవగాహన కార్యక్రమానికి ఆమె, స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం స్వచ్ఛత, ధర, ప్రమాణం వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు వినియోగ దారునికి ఉందని ఆమె అన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1986లో వచ్చిన వినియోగదారుల రక్షణ చట్టం అత్యంత ముఖ్యమైనదని, అన్నారు. ఈ చట్టం ప్రకారం ప్రతీ ఒక్కరు వస్తువుల నాణ్యత, ధర, బరువు, తయారపై ప్రశ్నించే హక్కును పొందుతారని ఆయన వివరించారు. అంతకుముందు వినియోగదారుల హక్కుల కరపత్రం ఆవిష్కరించారు. వన్‌టౌన్ సీఐ ఎం. అప్పయ్య, వినియోగదారుల న్యాయవాదులు విజయలక్ష్మి, చంద్రశేఖర్, అధ్యక్షులు బాల్‌రాజ్, శివ శంకర్, చందు, మల్లికార్జున్, సత్యనారాయణ, ఎ.రాజసింహుడు, రామకొండ, రషీద్ పర్వేస్, శ్రీనివాసులు, లలిత తదితరులు పాల్గొన్నారు.