బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:15 PM
బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.

అచ్చంపేట, మార్చి 6 : బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని, దీన్ని అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా బీజేపీకి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసమే బీఎస్పీ బీఆర్‌ఎస్‌తో కలిసి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు. బహుజనులకు న్యాయం జరిగేది బీఎస్పీ, బీఆర్‌ఎస్‌తోనే అని అన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియో జకవర్గాల్లో బీఎస్పీ, బీఆర్‌ఎస్ పోటీ చేసే స్థానాలపై త్వరలో విధివిధానాలను, కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.