Share News

నేడు ఆలయాలలో కాంగ్రెస్‌ పూజలు

ABN , Publish Date - May 08 , 2024 | 11:15 PM

పార్లమెంట్‌ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, పొరపాటున తప్పుడు నిర్ణయం తీసుకుంటే పాలమూరు భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

నేడు ఆలయాలలో కాంగ్రెస్‌ పూజలు
యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి

- సీఎం రేవంత్‌ పదికాలాలు ఆ కుర్చీలో కూర్చోవాలి

- ఓటరు సరైన నిర్ణయం తీసుకునేలా

భగవంతుడి అనుగ్రహం ఉండాలి

- నేడు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఆలయాల్లో గుడిగంటలు మోగించే కార్యక్రమం

- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, మే 8 : పార్లమెంట్‌ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, పొరపాటున తప్పుడు నిర్ణయం తీసుకుంటే పాలమూరు భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లకు సద్బుద్ధి ప్రసాదించాలని గురువారం ఉదయం 8:30 గంటలకు ప్రతీ బూత్‌లో ఉన్న దేవాలయాల దగ్గర పూజలు చేయాలని పార్టీ నిర్ణయించిందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పది కాలాలపాటు సీఎం కుర్చీలో కూర్చొని మహబూబ్‌నగర్‌కు నిధుల వరద పారించి అభివృద్ధి లేమిని తుదముట్టిం చాలని దివ్యసంకల్పంంతో రేపు ఉదయం దేవాలయాలలో గుడిగంటలు మోగించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అదేవిధంగా దర్గాల వద్ద ఇలాంటి కార్యక్రమాలే చేపట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని గెలిపించడం ద్వారా ఎంతో అభివృద్ధి కళ్లముందుకు రాబోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

ఫ రూ.30 వేల కోట్లతో మరుగునపడ్ల పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని పునఃప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పాల మూరు చుట్టూ ఉన్న 25వేల ఎకరాల అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం హబ్‌, రూ.100 కోట్లతో మన్యంకొండ దేవస్థానం అభివృద్ధి, రూ.268 కోట్లతో మహబూబ్‌నగర్‌ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు అనుమతులు ఇచ్చారన్నారు. తిమ్మా పూర్‌ నుంచి అలంపూర్‌ వరకు ఎకనామిక్‌ కారిడార్‌ చేసే ప్రాజెక్ట్‌కు రూప కల్పన జరుగుతోందని వివరించారు. ఒక్కసారి మోసపోతే గోసపడతామ ని, ఈ అభివృద్ధి, అవకాశాన్ని జారవిడుచుకోవద్దని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, నాయకులు సంజీవ్‌ ముదిరాజ్‌, ఎన్‌పీ వెంకటేశ్‌, సిరాజ్‌ఖాద్రి, లక్ష్మణ్‌యాదవ్‌ పాల్గొన్నారు.

యాదవుల సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే

పాలమూరు : యాదవుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో యాదవ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాదవులు అంటేనే గోవులాంటి వ్యక్తిత్వం లాంటి వారని, ఇతరులకు ఎలాంటి హానీ చేయడం వారికి తెలియని మనసున్న మారాజులన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తరువాత మీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు. యాదవ కమ్యూనిటి హాలు విస్తరించటానికి సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ ముదిరాజు, బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌గౌడ్‌, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, శాంతన్న, పెద్దగొల్ల శ్రీకాంత్‌, లక్ష్మణ్‌యాదవ్‌, బండి మల్లేష్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:15 PM