Share News

పదేళ్లు కాంగ్రె్‌సదే అధికారం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:13 AM

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ప్రచారాలు పచ్చి అబద్ధాలని, పదేళ్ల పాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ భువనగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నా రు.

పదేళ్లు కాంగ్రె్‌సదే అధికారం
మునుగోడులో జరిగిన భువనగిరి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో అభివాదం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

మునుగోడు, ఏప్రిల్‌ 18: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ప్రచారాలు పచ్చి అబద్ధాలని, పదేళ్ల పాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ భువనగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నా రు. నల్లగొండ జిల్లా మునుగోడులో గురువారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు బీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీనే కాదన్నారు. చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం కాదు.. భారీ మెజార్టీ కోసం ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధిక మెజార్టీ తీసుకురావాలన్న దానిపై పోటీ పడుతున్నామని, ఏ నియోజకవర్గం నుంచి అధిక మెజార్టీ వస్తే ప్రభుత్వం నుంచి రూ.100కోట్లు నిధులు అభివృద్ధి కోసం అదనంగా కేటాయించనున్నట్లు చేసిన ప్రతిపాదనకు అందరు ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల ఆయన అభినందించారు. గతంలో కేసీఆర్‌ నియంతగా సాగించిన కుటుంబ పాలనలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. ఇప్పటికే కేసీఆర్‌ కూతురు లిక్క ర్‌ కేసులో జైలుకు వెళ్లిందని, ఆయనతో పాటు కొడుకు,న అల్లుడుతో పాటు పలువురు ముఖ్యనేతలు సైతం జైలుకు వెళటం ఖాయమన్నారు. దీంతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఖాళీ అయిందని, ఇక కేసీఆర్‌ దుకాణం బంద్‌ అయినట్టేనని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి శిష్యుడిగా ముద్రపడిన చామలను గెలిపించాలని తనకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారన్నారు. తనకు కుట్రలు కుతంత్రాల రాజకీయాలు లేవని. ముక్కుసూటిగా మాట్లాడుతానన్నారు. కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణకుమార్‌రెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు కలిసి మునుగోడు గడ్డపై ఏర్పాటు చేసిన ఒకే వేదికలో ఉండటం చూస్తుంటే పండుగ వాతావరణం ఉందన్నారు. పార్టీలో పనిచేసే కార్యకర్తలకు మాత్రమే గుర్తింపు ఉంటుందన్నారు. ఏఐసీసీ నాయకుడు రోహిత్‌ చౌదరి మా ట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు పదేళ్ల పాలనలో ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకిరేకల్‌, భువనగిరి, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనీల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేల్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు మిత్రులేనని, రాత్రిపూట దోస్తానం.. పగటి పూట శత్రుత్వంలా ఉంటారని ఎద్దేవా చేశారు. డీసీసీ చైర్మన్‌ శంకర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలా్‌షనేత, రాపోలు జయప్రకాష్‌, భవానీ రెడ్డి, బాలలక్ష్మీ, డీసీసీబీ డైరెక్టర్‌ కుం భం శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, నారబోయిన రవిముదిరాజ్‌, భూడిద లింగయ్యయాదవ్‌, తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు అచ్చిని ఐలయ్యకురుమ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:13 AM