Share News

హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:14 PM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లకోసం వస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని జడ్పీవైస్‌ చైర్మన్‌ యాదయ్య అన్నారు.

హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీవైస్‌ చైర్మన్‌ యాదయ్య

- జడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య

మిడ్జిల్‌, ఏప్రిల్‌ 17 : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లకోసం వస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని జడ్పీవైస్‌ చైర్మన్‌ యాదయ్య అన్నారు. బుధవారం జడ్చర్ల మండలంలోని ఆలూరు, బూర్గుపల్లి గ్రామాలలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలతో పార్లమెంట్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలుపునకు చేపట్టే కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు స్థానికులు కారని, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే స్థానికుడని, గెలిపించుకునేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. ప్రతీ ఇంటికి వెళ్లి హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఓట్లు వేయమని అడిగే కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు శంకర్‌నాయక్‌, ఇంతియాజ్‌ఖాన్‌, కృష్ణకుమార్‌, వెంకట్‌రెడ్డి, నర్సింములు, కృష్ణయ్య, మౌలాన, శేఖర్‌, యాదయ్య, కొండయ్య ఉన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 11:14 PM