Share News

కాంగ్రెస్‌లో చేరికల జాతర

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:50 AM

కాంగ్రె్‌సలో చేరికల జాతర కొనసాగుతూనే ఉంది. మంగళవారం వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు హస్తం గూటికి వెళ్లారు. కేంద్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సముద్రాల వేణుగోపాలా చారి మం సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌లో చేరికల జాతర

హస్తం గూటికి వేణుగోపాలా చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు..

రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ కూడా

హైదరాబాద్‌/హయత్‌నగర్‌/జహీరాబాద్‌/చేర్యాల, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సలో చేరికల జాతర కొనసాగుతూనే ఉంది. మంగళవారం వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు హస్తం గూటికి వెళ్లారు. కేంద్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సముద్రాల వేణుగోపాలా చారి మం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావూ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్‌రెడ్డి తన నివాసంలో వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే సరూర్‌నగర్‌ మాజీ కార్పొరేటర్‌ అనిత, ఆమె భర్త దయాకర్‌రెడ్డిలు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఇదిలా ఉంటే గాంధీభవన్‌లో పార్టీ ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, మహే్‌షకుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యే లక్ష్మణ్‌ కుమార్‌ల సమక్షంలో కోరుట్ల నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు కాంగ్రె్‌సలో చేరారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన పలువురు బీజేపీ నేతలూ హస్తం గూటికి వెళ్లారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యతానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌ సమక్షంలో ఆయన కాంగ్రె్‌సలో చేరారు.

హస్తం గూటికి టీఎస్‌ఐడీసీ మాజీ చైర్మన్‌

జహీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ నేత, టీఎ్‌సఐడీసీ మాజీ చైర్మన్‌ మహమ్మద్‌ తన్వీర్‌ తన అనుచరగణంతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఫిలిం కార్పొరేషన్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మంకాల్‌ సుభాష్‌ తదితరులు కూడా హస్తం గూటికి వెళ్లారు. ఇటీవల బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసిన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన నాగపురి కిరణ్‌కుమార్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 03:50 AM